Telangana Patrika (December 05): ఈ వారం మీ జీవితంలో ఏమి జరగబోతోందో? Today Rasi Phalalu ద్వారా ఉద్యోగం, వ్యాపారం, ఆర్థికం, ఆరోగ్యం మరియు కుటుంబ జీవితంపై పూర్తి వివరణ ఇక్కడ చూడండి.

Today Rasi Phalalu – మేషం నుండి మీనం వరకు ఈ రోజు రాశి ఫలితాలు.
Today Rasi Phalalu : 04-12-2025 రాశి ఫలితాలు!
మేషం
ఉద్యోగంలో విజయం సాధించడానికి కష్టపడాలి. విద్యార్థులు కెరీర్లో పురోగతికి అవకాశాలు పొందుతారు. ఖర్చులు అకస్మాత్తుగా పెరగొచ్చు. మనస్సు ఆందోళన చెందుతుంది. కొత్త వ్యాపారం ప్రారంభించడానికి ఇది శుభసమయం. వైవాహిక జీవితంలో సమస్యలు పరిష్కరించుకుంటారు.
వృషభం
పెట్టుబడులు మంచి రాబడిని అందిస్తాయి. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. వృత్తి జీవితంలో మెరుగైన ఫలితాలు పొందడానికి బాధ్యతాయుతంగా పని చేయండి. వ్యాపారంలో ఎలాంటి రిస్క్ తీసుకోకండి. సోదరులతో అభిప్రాయభేదాలు తలెతొచ్చు. సంబంధాల్లో అంతరం ఉండొచ్చు. ఆరోగ్యం గురించి నిర్లక్ష్యంగా ఉండకండి.
మిథునం
మిశ్రమ ఫలితాలు ఉంటాయి. ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోండి. నిర్ణయాలు తీసుకోవడంలో గందరగోళానికి గురవుతారు. మీ ఇమేజ్ను నాశనం చేయడానికి ఆఫీసులో ఎవరైనా ప్రయత్నించొచ్చు. చాలా కాలంగా పెండింగ్లో ఉన్న పనులు విజయవంతమవుతాయి. ఆహారం పట్ల శ్రద్ధ వహించండి.
కర్కాటకం
కోపం నియంత్రించుకోండి. ఆహ్లాదకరమైన ప్రయాణాలకు అవకాశాలుంటాయి. ఆస్తికి సంబంధించి వివాదాలు తలెతొచ్చు. కుటుంబ జీవిత సమస్యలు శాంతియుతంగా పరిష్కరించుకోండి. నిలిచిపోయిన డబ్బు తిరిగి వస్తుంది. ఆస్తి కొనడానికి లేదా అమ్మడానికి మంచి రోజు.
సింహం
తెలియని భయంతో మనస్సు కలవరపడొచ్చు. కుటుంబ సభ్యులతో గొడవలు వచ్చే అవకాశం ఉంది. కోపం నియంత్రించుకోండి. తొందరపడి ఎలాంటి నిర్ణయాలు తీసుకోవద్దు. తల్లిదండ్రుల ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండండి. ఆర్థిక పరిస్థితి బాగుంటుంది. కొత్త ఆదాయ వనరులు రావొచ్చు. ఉద్యోగ, వ్యాపారాల్లో పురోగతి ఉంటుంది.
కన్య
సంపద పెరుగుతుంది. కుటుంబ జీవితంలో ఆనందం ఉంటుంది. మీ ఉద్యోగంలో మార్పు వచ్చే అవకాశాలు ఉన్నాయి. మీకెరీర్లో పురోగతి సాధించడానికి కొత్త అవకాశాలు పొందుతారు. ఆఫీసులో ఎవరైనా మీ ఇమేజ్ను పాడు చేయొచ్చు. ఎవరి గురించైనా కఠినమైన వ్యాఖ్యలు చేయడం మానుకోండి. ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి. విదేశాల్లో చదువుకోవాలనుకునే విద్యార్థులకు శుభవార్త అందొచ్చు.
తుల
ఈ రోజు బాగుంటుంది. అన్ని పనులు ఎటువంటి అడ్డంకులు లేకుండా విజయవంతమవుతాయి. కోపం నియంత్రించండి. ఉద్యోగంలో నిర్లక్ష్యంగా ఉండకండి. నిర్లక్ష్యం సవాళ్లకు దారితీయొచ్చు. ఒకేసారి ఎక్కువ పనులకు బాధ్యత తీసుకోకండి. విద్యార్థులు చదువుపై ఎక్కువ దృష్టి పెట్టాలి.
వృశ్చికం
కెరీర్లో విజయం సాధిస్తారు. ఓర్పుతో ఉండండి. తొందరపడి ఎలాంటి నిర్ణయాలు తీసుకోకండి. సమాజంలో మీ గౌరవం పెరుగుతుంది. వ్యాపారంలో ఎవరినీ గుడ్డిగా నమ్మొద్దు. ఈ రోజు ఎవరికీ పెద్దగా అప్పు ఇవ్వకండి.
ధనస్సు
ఆర్థిక పరిస్థితి బాగుంటుంది. కొత్త ఆదాయ వనరులు సృష్టించబడతాయి. వైవాహిక జీవితంలో సమస్యలు ఎదుర్కోవచ్చు. జీవిత భాగస్వామితో అభిప్రాయభేదాలు తలెత్తే అవకాశం ఉంది. కుటుంబ జీవిత సమస్యలను సంభాషణ ద్వారా పరిష్కరించుకోండి. సామాజిక పనులపై ఆసక్తి పెరుగుతుంది. కార్యాలయంలో కొత్త పనులకు బాధ్యత వహిస్తారు.
మకరం
వృత్తి జీవితంలో కొత్త సవాళ్లు ఎదుర్కోవాల్సి రావొచ్చు. వాహనం జాగ్రత్తగా నడపాలి. చాలా కాలంగా పెండింగ్లో ఉన్న పనులు విజయవంతమవుతాయి. వ్యాపారంలో విస్తరణ ఉంటుంది. ఈ రోజు పెట్టుబడి నిర్ణయాలు తెలివిగా తీసుకోండి. పిల్లల ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి.
కుంభం
మిశ్రమ ఫలితాలు ఉంటాయి. ప్రత్యర్థులు చురుగ్గా ఉంటారు. వ్యాపారంలో లాభం ఉంటుంది. ఆర్థిక విషయాల్లో చిన్న చిన్న సమస్యలు ఎదుర్కోవచ్చు. ఖర్చులు అదుపులో ఉంచుకోండి. ఆస్తుల నుండి ఆర్థిక లాభాలు ఉంటాయి. చదువులో మంచి ఫలితాలు పొందుతారు. కుటుంబ సభ్యుల మద్దతు లభిస్తుంది. ప్రేమ జీవితం బాగుంటుంది.
మీనం
ఉద్యోగ, వ్యాపారంలో సమయం అనుకూలంగా ఉంటుంది. కొత్త పెట్టుబడి అవకాశాలు అందుబాటులోకి వస్తాయి. వివాహ ప్రయత్నాలు ఫలించవచ్చు. కష్టానికి తగిన ప్రతిఫలం లభిస్తుంది. కెరీర్లో విజయం సాధిస్తారు. వ్యాపారంలో కొత్త అవకాశాలు లభిస్తాయి. ఈ అవకాశం ద్వారా ఆర్థిక లాభం ఉంటుంది.
ప్రతి రోజు మీ రాశి ఫలాలు(Today Rasi Phalalu) ఎలా ఉన్నాయో తెలుసుకోవాలి అంటే మా తెలంగాణ పత్రిక నీ చూడండి
Disclaimer
రాశిఫలాలు (Today Rasi Phalalu )సాధారణ మార్గదర్శకం మాత్రమే. వ్యక్తిగత పరిస్థితులు భిన్నంగా ఉండవచ్చు.


Comments are closed.