సోమవారం సాయంత్రం Telangana Earthquake రాష్ట్ర ప్రజలను ఒక్కసారిగా గుబురుకు గురి చేసింది. సాయంత్రం 6:50 నిమిషాల ప్రాంతంలో తెలంగాణలోని అనేక పట్టణాలు మరియు గ్రామాల్లో భూమి సుమారు 5 సెకన్ల పాటు తీవ్రంగా కంపించింది.
ఈ భూకంప ప్రభావం జగిత్యాల, కరీంనగర్, వరంగల్, సిద్దిపేట, నిర్మల్, పెద్దపల్లి, మహబూబాబాద్, ఖమ్మం, నల్లగొండ, నిజామాబాద్, ఆదిలాబాద్ సహా పలు జిల్లాల్లో నమోదు అయ్యింది. భూకంపం సమయంలో పెద్ద శబ్దం వినిపించిందని, వైబ్రేషన్స్తో ప్రజలు భయాందోళనకు గురయ్యారని స్థానికులు తెలిపారు.
Telangana Earthquake లైవ్ లో కనిపించిన చిత్రాలు
భూమి ఒక్కసారిగా కంపించడంతో ఇంట్లో ఉన్న వారు ఒక్కసారిగా బయటికొచ్చారు. “ఇల్లు కదులుతోంది”, “తలకిందులుగా తిరుగుతోంది” అన్న అనుభూతులు వ్యక్తం చేశారు.
ప్రస్తుతం ఈ భూకంపానికి సంబంధించి పూర్తి వివరాలు రావాల్సి ఉంది. భూకంప తీవ్రత, కేంద్ర బిందువు తదితర సమాచారం కోసం అధికారిక నివేదిక కోసం వేచి చూడాల్సి ఉంది.

Read Also: Sircilla Earthquake: సిరిసిల్లలో స్వల్ప భూకంపం – ప్రజల్లో ఆందోళన
Comments are closed.