AADI SRINIVAS: పేదవారికి కడుపునిండా సన్న బియ్యంతో భోజనం.

తెలంగాణ పత్రిక (APR.07):విప్ ఆది శ్రీనివాస్.రాష్ట్రంలోని ప్రతి నిరుపేద కుటుంబానికి సన్న బియ్యంతో కడుపునిండా అన్నం అందించాలన్న సంకల్పంతో ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు ప్రారంభించిన సన్న బియ్యం పంపిణీ కార్యక్రమం నేపథ్యంలో, రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండలం నిమ్మపల్లి గ్రామం జేసేవలాల్ తండాలో విశేష దృశ్యం కనపడింది.

ఆ గ్రామంలో గిరిజన బిడ్డ ఇస్లావత్ మధుకర్ ఇంట్లో ఆయన కుటుంబ సభ్యులతో కలిసి రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ (AADI SRINIVAS) గారు స్వయంగా సహపంక్తి భోజనం చేస్తూ రాష్ట్రం తీసుకుంటున్న నూతన మార్గదర్శక విధానాలకు రూపం ఇచ్చారు.

ఈ సందర్భంలో ఆయన కుటుంబ సభ్యులను, తండా వాసులను అడిగి సన్న బియ్యం నాణ్యత గురించి తెలుసుకున్నారు. ప్రజల అభిప్రాయాలను స్వయంగా తీసుకోవడం, ప్రభుత్వ కార్యక్రమాలపై ప్రజల్లో విశ్వాసం పెంచే ప్రయత్నంగా పేర్కొనవచ్చు.

గిరిజన బిడ్డా ఇంట్లొ భోజనం చేసిన ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ గారు

తండా ప్రజలు మాట్లాడుతూ, “దొడ్డు బియ్యం రోజుల్లో తీసుకునేందుకు మనసుండేది కాదు. కానీ ఇప్పుడు ఇచ్చే సన్న బియ్యం బాగా నచ్చింది, కుటుంబానికి చాలా ఉపయోగంగా ఉంది” అంటూ ఆనందం వ్యక్తం చేశారు.అలాగే తండాలో గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం అందించిన మంచినీటి ప్రాజెక్టు గురించి గుర్తుచేసుకుంటూ, “ఇప్పటికీ ఆ నీటినే తాగుతున్నాం. కాంగ్రెస్ పట్ల మాకు ఎప్పటికీ కృతజ్ఞత ఉంటుంది” అంటూ తెలిపారు.

Read More: Praja palana – పేదలకు సమృద్దిగా సన్న బియ్యం పంపిణీ

Share

2 Comments on “AADI SRINIVAS: పేదవారికి కడుపునిండా సన్న బియ్యంతో భోజనం.”

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *