తెలంగాణ పత్రిక (APR.28) , పహల్‌గాం (Pahalgam Attack) దాడి అనంతరం భారత్‌ను వీడిన 537 మంది పాకిస్థానీలు
భారత్-పాకిస్తాన్ సంబంధాల్లో తాజా పరిణామంగా, పహల్‌గాం దాడి అనంతరం కేంద్ర ప్రభుత్వ ఆంక్షల నేపథ్యంలో 537 మంది పాకిస్థాన్ పౌరులు నాలుగు రోజుల్లో భారత్‌ను వీడి స్వదేశానికి వెళ్లిపోయారు.

Pahalgam Attack తర్వాత భారత్ ను వదిలి వెళ్లిపోతున్నా పాకిస్తానీ లు
అటారీ-వాఘా సరిహద్దు గుండా వారు పాక్‌కు తిరిగి వెళ్లినట్లు అధికారిక వర్గాలు వెల్లడించాయి. భారతదేశంలో ఉన్న పాక్ పౌరులకు వివిధ రకాల స్వల్పకాలిక వీసాలు (Short-term Visas) మంజూరయ్యాయి.
అయితే ఇటీవల భారత ప్రభుత్వం స్వల్పకాలిక వీసాదారులపై కఠిన ఆంక్షలు విధించింది. వీరంతా నిర్దిష్ట గడువు మించకుండా భారత్‌ను విడిచిపెట్టాలని సూచించింది. ఫలితంగా గడువు ముగిసే నాటికి 537 మంది పాకిస్థానీలు వెనుదిరిగారు. ఇదే సమయంలో పాకిస్థాన్ నుండి 850 మంది భారతీయులు భారత్‌కు తిరిగి వచ్చారు. వీరిలో చాలామంది పర్యటనలు, కుటుంబ కార్యక్రమాలు, వ్యాపార కార్యకలాపాల కోసం పాక్ వెళ్లి వచ్చారు. 12 రకాల వీసాదారులకు గడువు ఏప్రిల్ 27, 2025న ముగిసింది. మెడికల్ వీసాదారులకు మాత్రమే ప్రత్యేకంగా మరొక రోజు గడువు ఇచ్చారు. గడువు ఉల్లంఘించిన పక్షంలో పాక్ పౌరులకు మూడేళ్ల జైలు శిక్ష లేదా రూ.3 లక్షల జరిమానా లేదా రెండూ కలిపి విధించే అవకాశం ఉంది. ఈ చర్యల వెనుక జాతీయ భద్రత, అక్రమ వలసదారుల నియంత్రణ వంటి కీలక కారణాలు ఉన్నాయని సమాచారం. భారత ప్రభుత్వం విదేశీ పౌరుల పట్ల కఠినమైన నిబంధనలు అమలు చేసి దేశంలోని శాంతి భద్రతలను పరిరక్షించేందుకు కట్టుబడింది.
Read More: Read Today’s E-paper News in Telugu
Comments are closed.