తెలంగాణ పత్రిక (APR.13),Rama Navami 2025: శనివారం నాడు నర్సంపేట ఆర్టీసి డిపో ఆవరణలో భక్తి మయమైన వాతావరణం నెలకొంది. శ్రీ సీతారాముల కళ్యాణానికి సంబంధించిన పవిత్ర తలంబ్రాలు ముందుగా బుకింగ్ చేసుకున్న డిపో ఉద్యోగులు, భక్తులకు అందజేయడం జరిగింది. ఈ తలంబ్రాలను డిపో మేనేజర్ శ్రీమతి ప్రసూన లక్ష్మీ గారు స్వయంగా అందజేసారు.

Rama Navami 2025: డిపో మేనేజర్ శ్రీమతి ప్రసూన లక్ష్మీ గారు ఆమె మాట్లాడుతూ,
“సీతారాముల కళ్యాణ మహోత్సవాన్ని ప్రత్యక్షంగా చూసే అవకాశం లేకపోయినా, భక్తుల ఆరాధనకు ఈ తలంబ్రాలు అక్షింతలుగా ఉపయోగపడతాయని భావిస్తున్నాం. ఈ అవకాశాన్ని కల్పించిన TSRTC ఎండి సజ్జనార్ సార్ కు, దేవాదాయ శాఖ అధికారులకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం.”
ఈ తలంబ్రాల పంపిణీలో భాగంగా బుకింగ్ ఏజెంట్లుగా పని చేసిన డిపో ఉద్యోగులు నరేందర్, రవీందర్, రాంబాబు, పుష్పలీల, ఏ డి సి నారాయణ లను ప్రత్యేకంగా అభినందించారు.ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ ఇంజనీర్ ప్రభాకర్, ఆఫీస్ సిబ్బంది వెంకటరెడ్డి, శ్రీను, కిషోర్, ఎస్ డి ఐ వెంకటేశ్వర్లు, బాబు తదితరులు పాల్గొన్నారు. భక్తుల భాగస్వామ్యం కూడా గణనీయంగా ఉండింది.
ఈ తరహా కార్యక్రమాలు భక్తులకి ఆధ్యాత్మిక అనుభూతిని కలిగిస్తాయి, అలాగే ప్రభుత్వ యంత్రాంగం భక్తుల కోసం తీసుకునే చర్యలకు ప్రతిరూపంగా నిలుస్తాయి.
Read more: Read Today’s E-paper News in Telugu