Government schemes ప్రజలకు చేరవేశ బాధ్యత అధికారులది అని ఆర్మూర్ ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి

Government schemes: శుక్రవారం నాడు ఎమ్మెల్యే కార్యాలయంలో సమీక్ష సమావేశం నిర్వహించారు ఐదు మండలాల రెవెన్యూ, ఇరిగేషన్, మండల పరిషత్ అధికారులు, మున్సిపల్ కమిషనర్, ఆర్డివో అధికారులతో కలిసి సమీక్ష సమావేశం నిర్వహించారు. పైలెట్ ప్రాజెక్టు కింద వివిధ మండలాల్లో ఇందిరమ్మ ఇండ్ల జాబితా మరియు వాటి నిర్మాణానికి ఎంచుకున్న గ్రామాలను ఎంతవరకు వచ్చాయని, వేసవికాలంలో త్రాగునీటికి కొరత లేకుండా చూడాలని, మున్సిపాలిటీ పరిధిలో నిర్మిస్తున్న ఇండ్లు మున్సిపల్ అనుమతితో నిర్మించాలని లేనిపక్షంలో ఇండ్ల నిర్మాణాన్ని అడ్డుకోవాలని, వెంచర్లు వేసిన ప్రభుత్వ నిబంధనలు ప్రకారం వేయాలని ఆర్మూర్ మున్సిపల్ లో ప్రభుత్వ భూములన్నీ గుర్తించి హద్దులు పెట్టాలని ఎక్కడైనా ప్రభుత్వ భూములు గానీ, ఇరిగేషన్ భూములు గాని కబ్జా చేయడానికి ప్రయత్నిస్తే వారిపై క్రిమినల్ కేసులు పెట్టాలని సూచించారు. అధికారులు ప్రజలతో సత్సంబంధాలు ఉండే విధంగా మెలగాలని నాణ్యమైన సేవలు అధికారులు అందే విధంగా చూడాలని ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి కోరారు.

ఆర్మూర్ ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి Paidi Rakesh Reddy

Read More

Share

One Comment on “Government schemes ప్రజలకు చేరవేశ బాధ్యత అధికారులది అని ఆర్మూర్ ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి”

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *