Safe Swimming: వేసవి తాపం తో ఆగలేక కొందరు కాలువలు బావులు కుంటలు చెరువులలో ఈతకు వెళుతున్న సంఘటనలు చాలా ఉన్నాయి ఆ విధంగా వెళుతున్న తరుణంలో ఈతరాక ప్రాణాలు కోల్పోయిన సంఘటనలు జరిగినాయి అందువలన జాగ్రత్త తీసుకోవాలని స్టేషన్ హౌస్ ఆఫీసర్ డి.హరిత తెలియజేసినారు.
ఈ సంవత్సరం ఏప్రిల్ మొదటి వారం నుంచి ఎండలు మండుతున్న తరుణంలో అదేవిధంగా ఎన్ ఎస్ పి కాలువ నీరు నిరంతరం పారుతున్న తరుణంలో బావులు కుంటలు చెరువులు నిండుకుండలా ఉండటం వలన వాటిలోకి కొంతమంది వేసవి తాపం తీర్చుకొనుటకై ఈతకు వెళుతున్నారు అలా వెళ్లటం వలన కొంతమంది ఈతరాక మరిదైన ఇబ్బందితో నీటిలో మునిగి కార్యక్రమాలు కోల్పోవడానికి చాలా అవకాశాలు ఉన్నాయి అందువలన పెద్దలు పిల్లలను ఈతకు వెళ్లకుండా ఇంట్లోనే ఉంచి వారిని రక్షించుకోవాలి.

మునుపటిలా కాకుండా ప్రస్తుతం వేసవి కాలంలోనూ చెరువులు, కుంటలు, బావులు నీటితో నిండుకుండల్లా మారాయి. దీంతో పల్లెలు, పట్టణాలు అనే తేడా లేకుండా పిల్లలు, యువకులు వాటివైపు పరుగులు పెడుతున్నారు. ఈతలు కొడుతూ కేరింతలు కొడుతున్నారు. వేసవి తాపం తీర్చుకోవడానికి కొందరు, ఈత నేర్చుకోవడానికి మరి కొందరు, సరదాగా గడిపేందుకు ఇంకొందరు.. నీళ్లలో దూకి తమ ఈత ముచ్చట తీర్చుకుంటున్నారు. ఇక పాఠశాలలకు సెలవులు ప్రకటించిన తర్వాతనైతే విద్యార్థుల ఆటపాటల్లో ఈత ఓ భాగమైపోయింది. అయితే, కొన్ని సందర్భాల్లో ఈత విహారం విషాదానికి దారితీస్తున్నది. వినోదాన్ని పంచిన ఆ నీరే. చీకట్లోకి నెట్టివేస్తున్నది. నీటిలో చేపపిల్లలా ఈదుతూ గెంతులేసిన పిల్లలు. అదే నీటిపై విగత జీవులుగా తేలియాడాల్సి వస్తున్నది. ఎన్నో ఆశలు పెట్టుకున్న వారి తల్లితండ్రులకు గర్భశోకాన్ని మిగులుస్తున్నారు. నీటి విషయంలో అవగాహన లేకపోవడం, తోటి వారు ఈత కొడుతుండగా ఉత్సాహాన్ని ఆపుకోలేక, ఈత రాకున్నా నీటిలోకి దిగడం, ప్రవాహ నీటిలో ఈత కొట్టడం, చెరువులు, బావులు, కాలువల్లో ఈత పేరుతో ప్రయోగాలు చేయడం, చేపలు పట్టేందుకు పెట్టిన వైర్లకు తగిలి విద్యుత్ షాక్‌కు గురికావడం వంటి కారణాల వల్ల ప్రతి సంవత్సరం పదుల సంఖ్యలో ప్రాణాలు కోల్పోతున్నారు. ఇలాంటివి జరగకుండా ఉండాలంటే జాగ్రత్తలు పాటించాల్సిన అవసరం ఉన్నది.
ఈ విధంగా ప్రాణాలు కాపాడుకుందాం:
ఎవరైనా నీటిలో మునిగిన సమయాల్లో ఒడ్డున ఉన్న వారు గమనిస్తే వెంటనే వారిని ఒడ్డుకు చేర్చి శ్వాస ప్రక్రియను గమనించాలి. బాధితుడు శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు ఎదుర్కొంటే నోటిలోంచి గాలిని పంపించే ఏర్పాట్లు చేయాలి. చాతిపై రెండు చేతులతో ఒత్తిడి చేస్తూ శ్వాసక్రియ సరిగ్గా జరిగేలా చూడాలి. నీళ్లు మింగితే వెల్లకిలా పడుకోబెట్టి పొట్టను నెమ్మదిగా ఒత్తిపడుతూ నీటిని నోటి ద్వారా బయటకు వెళ్లేలా చేయాలి. నీళ్లు కక్కించిన తర్వాత బాధితుడిని కుడివైపు తిప్పి పడుకోబెట్టాలి. శ్వాస తీసుకునే విధానాన్ని పరిశీలించాలి. శ్వాసతీసుకోవడంలో ఇబ్బందులు పడితే, స్పృహలో లేకున్నా వెంటనే సమీపంలోని దవాఖానకు తీసుకెళ్లి చికిత్స అందేలా చూడాలి. అని ఆమె తెలియజేసినారు .