తెలంగాణ పత్రిక (APR.16), Waqf Board 2025: వక్ఫ్ బోర్డు (Waqf Board) అనేది ఇస్లామిక్ చట్టం ప్రకారం ధార్మిక లేదా మతపరమైన ప్రయోజనాల కోసం అంకితం చేయబడిన ఆస్తుల నిర్వహణ మరియు పర్యవేక్షణ కోసం ఏర్పాట్లు చేసిన చట్టబద్ధమైన సంస్థ.

వక్ఫ్ సవరణ చట్టంపై నేటి నుంచి సుప్రీంకోర్టులో న్యాయపోరాటం జరగనుంది. ఈ చట్టాన్ని సవాల్ చేస్తూ మొత్తం 73 పిటిషన్లు దాఖలయ్యాయి.
కాంగ్రెస్, టీఎంసీ, సీపీఐ, వైసీపీ, ఎస్పీ, టీవీకే, ఆర్జేడీ, జేడీయూ, ఆప్, ఎంఐఎం పార్టీలతో పాటు ఆల్ ఇండియా ముస్లిం లీగ్, ఇతరులు ఈ పిటిషన్లు వేశారు.
జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ సంజయ్ కుమార్, జస్టిస్ కేవీ విశ్వనాథన్ లతో కూడిన ధర్మాసనం మ.2 గంటల నుంచి వాదనలు విననుంది.
Read More: Read Today’s E-paper News in Telugu