Traffic Rules మైనర్లకు వాహనాలు ఇస్తే ఇక జైలుకే|IPS Sai chaitanya

Traffic Rules: నిజామాబాద్ పోలీస్ కమీషనర్ పి.సాయి చైతన్య, ఐపీఎస్. ఆదేశాల ప్రకారము ట్రాఫిక్ పోలీస్ వారు ఎన్ఫోర్స్మెంట్ డ్యూటీ చేసి సమయంలో (05) ఐదుగురు మైనర్లు ద్విచక్ర వాహనాలు నడుపుతూ పట్టు పడగా వారి యొక్క వాహనాలు అదుపులో తీసుకొని, వారి యొక్క కుటుంబ సభ్యులను పిలిచి, ఏ.సి.పి ట్రాఫిక్ నిజామాబాద్ టి. నారాయణ, ఆధ్వర్యంలో మరియు ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ నిజామాబాద్ ఎస్ హెచ్ ఓ, పి. ప్రసాద్ ,సమక్షంలో మైనర్లు మరియు వారి యొక్క తల్లిదండ్రులకు కౌన్సిలింగ్ నిర్వహించి సదరు ఐదుగురు వాహన యజమానులకు జరిమానాలు విధించినైనది.
ఇకముందు నుండి ఎవరైనా మైనర్లు వాహనము నడిపితే వాహన యజమానులపై కేసు నమోదు చేసి సంబంధిత న్యాయస్థానంలో హాజరు పరిచి చట్టపరమైన చర్యలు తీసుకొనబడును,మరియు రూ.25 వేల వరకు జరిమానా కూడా విధించబడును.
ద్విచక్ర వాహనాలు నడిపేవారు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలి లేనియెడల వారి యొక్క వాహనమును అదుపులో తీసుకొని ఆర్టిఏ కి వారి యొక్క లైసెన్సులను సస్పెండ్ గురించి పంపబడును.
అలాగే డ్రంకన్ డ్రైవ్లో పట్టుబడిన (15) మందికి కొన్సిలింగ్ నిర్వహించిన అనంతరం సెకండ్ క్లాస్ మెజిస్ట్రేట్ ముందర హాజరుపరచగా (10) మందికి రూ.14,500/- జరిమానా విధించి మిగిలిన ఐదుగురు అనగా (1). కామ్ లో వంశి, (2) అబ్దుల్ సాజిద్, (3), రాథోడ్ ఈరమ్మన్, (4), మునిపల్లి ఉదయ్ కిరణ్, (5), అమూల్ జింకన్వాడు అను వ్యక్తులకు రెండు రోజుల జైలు శిక్ష విధించనైనది.

కావున నిజామాబాద్ నగర ప్రజలు ట్రాఫిక్ రూల్స్ ను పాటిస్తూ ట్రాఫిక్ పోలీస్ వారికి సహకరించగలరని గలరని మనవి, లేనియెడల చట్టపరమైన చర్యలు తీసుకొనబడును.

Read More Traffic Rules

Share

One Comment on “Traffic Rules మైనర్లకు వాహనాలు ఇస్తే ఇక జైలుకే|IPS Sai chaitanya”

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *