Fraud in the name of Gupta Nidhi:- గుప్త నిధులు ఉన్నాయని ఓ వ్యక్తిని నలుగురు దుండగులు నమ్మించి రూ. 4 లక్షల 50,000 వేలు కాజేసిన ఘటన నిర్మల్ జిల్లా కడెం మండలంలో చోటుచేసుకుంది. ఈ ఘటనపై నిర్మల్ జిల్లా ఖానాపూర్ పట్టణ కేంద్రంలోని పోలీస్ స్టేషన్లో ఏఎస్పి రాజేష్ మీనా విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం హైదరాబాద్ కి చెందిన మహమ్మద్ అగ్బర్ అనే వ్యక్తిని హైదరాబాద్ లో అక్కడే డ్రైవర్ గా విధులు నిర్వహిస్తున్న ఖానాపూర్ మండలంలోని గోసంపల్లి గ్రామానికి చెందిన నరేష్ అనే వ్యక్తి తమ గ్రామ సమీపంలో గుప్త నిధులు నుండి తీసిన అరకిలో బంగారం ఉందని నాలుగు లక్షల 20 వేలకు మొత్తం ఇస్తామని మాయమాటలు చెప్పి నమ్మించి తమ గ్రామానికి పిలిచి అక్కడే మరో నలుగురు స్నేహితులతో కలిసి కడెం మండలంలోని కొత్త మద్ది పడగ గ్రామ సమీపంలోని అటవీ ప్రాంతానికి తీసుకెళ్లారు.

మాయ మాటలు నమ్మి మోసపోయిన వ్యక్తి ఇచ్చిన ఫిర్యాదుతో దుండగుల గుర్తింపు
అగ్బర్ ను కొట్టి కత్తితో బెదిరించి రూ. 4, 50000 వేల నగదును ఎత్తుకొని పారిపోయారు. మోసపోయానని తేరుకున్న అగ్బర్ వెంటనే కడెం పోలీస్ స్టేషన్లో పిర్యాదు చేశాడు. డ్రైవర్ నరేష్ అమ్మకు హెల్త్ బాగుండట్లేదని ఇంటి వద్ద బంగారం ఉందని బంగారంతో పాటు పొలం పేపర్లు పెట్టుకోని డబ్బులు ఇవ్వమని అగ్బర్ కి హైదరాబాదులో మాయమాటలు చెప్పి ఖానాపూర్ కు తీసుకొచ్చి డబ్బులు కాజేసినట్లు అగ్బర్ ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నాడు. దీంతో ఇచ్చిన పిర్యాదు మేరకు పోలీసులు విచారణ చేపట్టగా ఈ గుప్త నిధుల బంగారం కొరకే డబ్బులు ఇచ్చి మోసపోయిన విషయం వెలుగులోకి రావడంతో. పోలీసులు వెంటనే స్పందించి నిందితులు ముగ్గురిని ఆదుపులోకి తీసుకోని వారి వద్ద నుండి 1,47000 స్వాధీనం చేసుకొన్నారు. మిగతా డబ్బులతో పరారైన నరేష్ కోసం పోలీసులు గాలిస్తున్నారు. పట్టుకున్న నిందితులు ముగ్గురు వంశీ, చింటూ, నితిన్ లను శుక్రవారం రిమాండ్ కి తరలించినట్లు ఖానాపూర్ సిఐ అజయ్ వెల్లడించారు.
ఇలాంటి విషయాలపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పోలీసుల సూచన
Read More: Ration Shop Rice: రేషన్ షాప్ ల్లో సన్న బియ్యం పేరు తో రీసైక్లింగ్ బియ్యం పంపిణీ