తెలంగాణ పత్రిక (APR.28) , ప్రభుత్వం తీసుకొచ్చిన భూ భారతీ చట్టం (Bhu Bharathi Act) ద్వారా రైతులకు భూ రికార్డులు సవరిచుకునే అవకాశాన్ని కల్పించింది. నూతన ఆర్.ఓ.ఆర్ చట్టం ప్రకారం, సెక్షన్ 4 లోని సబ్ సెక్షన్ 4, 5 ఆధారంగా రైతులు తమ భూముల రికార్డులను సరిదిద్దుకోవచ్చు.దేశంలోనే మొట్టమొదటిసారిగా రైతులకు ఉచిత న్యాయ సహాయం,పక్కాగా రికార్డుల నిర్వహణ,పారదర్శకంగా భూముల వివరాలు,అవగాహన సదస్సులో కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు.

దరఖాస్తుకు గడువు:
ఈ చట్టం అమలులోకి వచ్చిన తర్వాత ఒక సంవత్సరం లోపు రైతులు దరఖాస్తులు సమర్పించాల్సి ఉంటుంది.
పైలట్ ప్రాజెక్ట్ ప్రారంభం:
ప్రస్తుతం రాష్ట్రంలోని నాలుగు మండలాల్లో ప్రయోగాత్మకంగా భూ భారతీ చట్టాన్ని అమలు చేస్తున్నారు. మే మొదటి వారంలో ప్రతి జిల్లాలో ఒక్కో మండలంలో అమలు చేసి, క్షేత్రస్థాయిలో వచ్చిన సూచనల ఆధారంగా అవసరమైన మార్పులు చేర్పులు చేస్తారని అధికారులు తెలిపారు.
Bhu Bharathi Act రైతులకు స్పెషల్ సదస్సులు
మే-జూన్ నెలల్లో అన్ని రెవెన్యూ గ్రామాల్లో సదస్సులు నిర్వహించి, భూ సమస్యలపై రైతుల నుంచి దరఖాస్తులు స్వీకరిస్తారు. రైతులు భూభారతి పోర్టల్ ద్వారా ఆన్లైన్లో కూడా దరఖాస్తు చేసుకోవచ్చు.
భూమి రిజిస్ట్రేషన్ మరియు మ్యుటేషన్ ప్రక్రియ
రైతుల దరఖాస్తులను పరిశీలించి, క్షేత్రస్థాయిలో సర్వే, విచారణ జరిపిన తర్వాత భూమి రిజిస్ట్రేషన్, మ్యుటేషన్ ప్రక్రియ జరుగుతుంది. రిజిస్ట్రేషన్ సమయంలో తప్పిదాలు జరిగినట్లయితే, అప్పీల్ చేసే అవకాశాన్ని కూడా ఈ చట్టం కల్పించింది.
రెండు అంచెల అప్పీల్ వ్యవస్థ
- తహసీల్దార్ నిర్ణయంపై సంతృప్తి లేకపోతే 60 రోజుల్లోపు ఆర్డీఓకి అప్పీల్ చేయొచ్చు.
- ఆర్డీఓ నిర్ణయంపై సంతృప్తి లేకపోతే 30 రోజుల్లోపు కలెక్టర్ వద్దకు అప్పీల్ చేసుకోవచ్చు.
- రెవెన్యూ కోర్టులు ఈ చట్టం ప్రకారం పునర్నిర్మించబడ్డాయి, అలాగే అవసరమైతే ల్యాండ్ ట్రిబ్యునల్ వద్ద ఫైనల్ అప్పీల్ చేయవచ్చు. సీసీఎల్ఏకి కూడా రివిజన్ అధికారాలు ఇవ్వబడ్డాయి.
ఉచిత న్యాయ సహాయం
దేశంలో తొలిసారిగా, పేద రైతులకు ఉచిత న్యాయ సహాయం అందించే అవకాశం భూభారతి చట్టం ద్వారా ఏర్పాటైంది. జిల్లా స్థాయిలో న్యాయ సహాయ బృందాలు రైతులకు న్యాయసలహాలు మరియు అవసరమైతే ఉచిత న్యాయ సహాయం అందిస్తాయి.
భూదార్ నంబర్ మరియు మ్యాప్ జత
ఆధార్ తరహాలో ప్రతి భూమికి ప్రత్యేకమైన భూదార్ నంబర్ కేటాయించబడుతుంది. దీని వల్ల భూ వివాదాలు, ఆక్రమణలకు అవకాశమే ఉండదు. భూముల హద్దులతో కూడిన మ్యాప్‌ను పట్టా పాస్ బుక్ లో జత చేస్తారు.
రైతులకు సూచన
ప్రభుత్వం సమగ్రంగా తీసుకొచ్చిన భూ భారతీ చట్టం ద్వారా రైతులు తమ భూ సమస్యల శాశ్వత పరిష్కారానికి ఉపయోగించుకోవాలని అధికారులు సూచించారు.
ఈ కార్యక్రమంలో ఇన్‌చార్జ్ ఆర్డీఓ స్రవంతి, తహసీల్దార్లు బాలరాజు, నాగార్జున, రైతులు, స్థానిక నాయకులు పాల్గొన్నారు
Read More: Read Today’s E-paper News in Telugu
Comments are closed.