తెలంగాణ పత్రిక (MAY 01) , దేశవ్యాప్తంగా బీసీల BC Reservation కులగణన చేపట్టాలని కేంద్రం తీసుకున్న నిర్ణయాన్ని బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధికార ప్రతినిధి పర్శ హన్మాండ్లు హర్షాతిరేకాలతో స్వాగతించారు. గురువారం సిరిసిల్ల ప్రెస్ క్లబ్‌లో జిల్లా బీసీ నాయకులతో కలిసి పర్శ హన్మాండ్లు మాట్లాడారు. కేంద్రం ఈ నిర్ణయం తీసుకోవడం నేపథ్యంలో మిఠాయిలు పంచుకుని ఆనందం వ్యక్తం చేశారు.

బీసీల BC Reservation గురించి పర్శ హన్మాండ్లు మాట్లాడుతూ..
పర్శ హన్మాండ్లు మాట్లాడుతూ – బీసీలకు చట్టసభలలో రిజర్వేషన్లు, పదోన్నతుల్లో అవకాశాలు కల్పించాలని, ఓబీసీలకు ప్రత్యేక మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేయాలని ఎన్నో దశాబ్దాలుగా పోరాడుతున్నామని తెలిపారు. గతంలో కేంద్రం సుప్రీంకోర్టులో కులగణనపై అఫిడవిట్ సమర్పించిన విషయాన్ని గుర్తు చేశారు. బీసీ సంక్షేమ సంఘం మరియు అనేక ఓబీసీ సంఘాల నిరంతర ఉద్యమాల ఫలితంగా కేంద్రం దిగివచ్చిందని చెప్పారు. రాహుల్ గాంధీ కులగణనను జాతీయ ఎజెండాగా తీసుకురావడం, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీలో జరిగిన ధర్నాలో పాల్గొనడం వల్ల కేంద్రంపై ఒత్తిడి పెరిగిందని వివరించారు.ఇదే బీజేపీ పాలనలో బీసీలకు వచ్చిన తొలి చారిత్రాత్మక అవకాశమని పేర్కొన్నారు. కులగణన పూర్తయ్యేవరకు, బీసీ జనాభా ప్రకారం రిజర్వేషన్లు పెంచే వరకు ఉద్యమం ఆగదని స్పష్టం చేశారు.
ఈ సమావేశంలో బీసీ సంఘాల నాయకులు వీరవేణి మల్లేశ్ యాదవ్, కమలాకర్, గొప్పదేవయ్య, తడ్క కమలాకర్, తిరుపతి, బచ్చు ప్రసాద్, రోహిత్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.
Read More: Read Today’s E-paper News in Telugu
Comments are closed.