AI Passport Verification: ఇప్పుడు పాస్‌పోర్ట్ తయారీ ప్రక్రియ మరింత వేగవంతంగా, సురక్షితంగా మారుతోంది. పోలీస్ వెరిఫికేషన్ నుండి డాక్యుమెంట్ల స్కానింగ్ వరకు అన్ని దశల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) వినియోగించనున్నారు. విదేశాంగ మంత్రిత్వశాఖ పాస్‌పోర్ట్ విభాగం ఆధునిక సాంకేతికతను ఉపయోగించేందుకు ప్రణాళికలు సిద్ధం చేసింది.
ఈ మార్పుల కారణంగా, ఇప్పటివరకు సాధారణంగా 30 రోజులు పట్టే పాస్‌పోర్ట్, ఇకపై కేవలం 15 రోజుల్లోనే సిద్ధమవుతుంది.
ఫూల్‌ప్రూఫ్ వెరిఫికేషన్‌కు AI
ఆటోమేటెడ్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ కింద, AI టూల్స్ ద్వారా అప్లికేషన్ ఫారమ్ మరియు ఆధార్ కార్డ్, జనన ధృవీకరణ పత్రం, చిరునామా రుజువు వంటి డాక్యుమెంట్లను స్కాన్ చేసి, వాటి నిజతను ధృవీకరిస్తాయి. ఫాంట్స్, సంతకాలూ, బార్కోడ్స్ వంటి భద్రతా లక్షణాలను విశ్లేషించడంతో పాటు తప్పులుంటే అప్లికెంట్‌కు వెంటనే నోటిఫికేషన్ పంపిస్తాయి. దీంతో మానవ ప్రమేయం తగ్గుతుంది.
ఫేక్ డాక్యుమెంట్లను గుర్తించడంలో సహాయం
మెషీన్ లెర్నింగ్ మోడల్స్ ద్వారా నకిలీ ఫోటోలు, సంతకాలు లేదా మార్పు చేసిన బార్కోడ్స్‌ను గుర్తించగలుగుతాయి. దీంతో అప్లికేషన్ ప్రక్రియ మరింత నమ్మకమైనదిగా మారుతుంది.
AI Passport Verification పోలీస్ వెరిఫికేషన్ వేగవంతం
పోలీస్ వెరిఫికేషన్ ప్రక్రియను కూడా AI ఆధారంగా వేగవంతం చేస్తారు. CCTNS (Crime and Criminal Tracking Network and Systems) డేటాబేస్‌తో అనుసంధానం చేసి, అప్లికెంట్ వివరాలను క్రిమినల్ రికార్డులతో తక్షణమే సరిపోల్చడం జరుగుతుంది. దీంతో మునుపటిలా మానవ వెరిఫికేషన్ అవసరం లేకుండా వేగంగా పూర్తవుతుంది.
మరిన్ని సౌకర్యాలు
బయోమెట్రిక్స్, అడ్వాన్స్‌డ్ డేటా అనాలిసిస్, చాట్‌బాట్స్ వంటి ఆధునిక టెక్నాలజీలు కూడా పాస్‌పోర్ట్ ప్రక్రియలో భాగం కానున్నాయి. అప్లికేషన్ లో ఎలాంటి లోపాలు ఉంటే వెంటనే సరిచేసుకునే అవకాశం ఉంటుంది. ఇంటర్వ్యూ అపాయింట్మెంట్ పొందడంలో కూడా ఇది సహాయపడుతుంది.
Comments are closed.