Nirmal Jilla News: శతావధానములో నిర్మల్ జిల్లా కవి వెంకట్ కు ప్రాశ్నిక సన్మానం.

తెలంగాణ పత్రిక (APR.15) : Nirmal Jilla News 2025 . నిర్మల్ జిల్లా కి చెందిన ప్రముఖ పద్యకవి, వ్యాఖ్యాత ,డా. బి వెంకట్ తెలుగు విశ్వవిద్యాలయం, ప్రజ పద్యం, అవధాన విద్యా వికాస పరిషత్ సంయుక్త నిర్వహణలో తెలుగు విశ్వవిద్యాలయం,ఎన్టీఆర్ కళామందిరంలో జరిగిన డా. మారేపల్లి‌ వెంకటరమణ పట్వర్ధన్ సంపూర్ణ శతావధానములో -విశ్రాంత గౌరవం న్యాయమూర్తి యు.దుర్గా ప్రసాదరావు, అధ్యక్షులు నారుమంచి వెంకట అనంతకృష్ణ, అవధాన విద్యా వికాస పరిషత్తు ప్రధానకార్యదర్శి మరుమాముల దత్తాత్రేయ శర్మ,‌ దర్శనం మాస పత్రిక ప్రధాన సంపాదకులు‌ మరుమాముల వెంకటరమణ శర్మ, తెలుగు విశ్వవిద్యాలయం ఉపాధ్యక్షులు ఆచార్య వెలుదండ నిత్యానందరావు, రిజిస్ట్రార్ ఆచార్య కోట్ల హనుమంతరావు, సంచాలకులు ఆముదాల మురళి, శతావధాని పట్వర్ధన్ చేతులమీదుగా శతావధానం పృచ్ఛక సన్మానమును ప్రముఖ పద్యకవి, సంస్కృతభాషా ప్రచార సమితి, ఆదిలాబాదు, నిజామాబాదు ఉమ్మడి జిల్లాల వ్యవస్థాపక అధ్యక్షులు డా. బి. వెంకట్‌ అందుకున్నారు‌. “ఈనెల‌ 12వ తేదీ నుండి మంగళవారం వరకు హైదరాబాదులో జరిగిన డా. మారేపల్లి వెంకటరమణ పట్వవర్ధన్ సంపూర్ణ శతావదానంలో‌ వెంకట్ పాల్గొని వర్ణన” అనే అంశంలో సర్వం శివమయం జగత్, రామాయణం రసామృతకావ్యం, పురాణశ్రేష్ఠం శ్రీమద్భాగవతం, అంశములను జోడిస్తూ, గత నెలలో జరిగిన ప్రయాగ్రాజ్ కుంభమేళా ఇతిహాసమును తీసుకొని నైమిశారణ్యములో కోట్లకొలది భక్తులు సంచరిస్తుంటే, నైమిషారణ్యము ఏ విధంగా ఆనందపడినదో, ఆ దృశ్యమును సుందరముగా వర్ణించుమని అవధానిని అడుగగా ,ఉమ్మడి ఆదిలాబాదు జిల్లా చెన్నూరుకు చెందిన డా. మారెపల్లి వెంకటరమణ పట్వర్ధన్ సంపూర్ణ శతావధానం అవలీలగా పద్యరూపములో వర్ణించారని, చాలా ఆనందం వేసిందని వెంకట్ చెప్పారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ నుండి వందమంది ప్రాశ్నకులు పాల్గొనగా నిర్మల్ నుండి వెంకట్ ఒక్కరే పాల్గొన్నారు. అవధానులు, శతావధానులు- జీ ఎం రామశర్మ, డా. రేవూరి అనంతపద్మనాభ శర్మ, డా సంగనభట్ల నరసయ్య, ఆచార్య వాసిరెడ్డి వెంకట్ రెడ్డి, డా పీటీజీవి రంగాచార్యులు, మల్లాప్రగడ శ్రీమన్నారాయణ మూర్తి, తదితరులు పాల్గొన్నారని వెంకట్ చెప్పారు.

Join WhatsApp Group Join Now

nirmal jilla-news-2025

Read Also: ప్రజాస్వామ్య రక్షణే జై బాపు, జై భీమ్, జై సంవిధాన్ లక్ష్యం-ఆత్రం సుగుణక్క

About Ganeshghani

GaneshGhani is a Editor with 1.5 years of experience in writing news articles on topics like education, jobs, and politics, clear, and engaging stories that are easy to understand and hold the reader’s interest, making complex topics accessible and relatable to a larger audience.

View all posts by Ganeshghani →