తెలంగాణ పత్రిక (APR.14), Adilabad 2025: రాజ్యాంగ విలువలపై ప్రజల్లో అవగాహన పెంచడమే లక్ష్యమని, ప్రజాస్వామ్యాన్ని రక్షించుకోవడానికి రాహుల్ గాంధీ జై బాపు, జై భీమ్, జై సంవిధాన్ నినాదానికి పిలుపునిచ్చినట్లు కాంగ్రెస్ పార్టీ ఆదిలాబాద్ పార్లమెంట్ ఇంచార్జ్ ఆత్రం సుగుణక్క అన్నారు

ఆదిలాబాద్ జిల్లా (Adilabad 2025) లోని ఆదివారం ఇచ్చోడ మండలంలోని కేశవపట్నం, గుండాల, నర్సాపూర్, సిరిచల్మ గ్రామాల్లో జై బాపు, జై భీమ్, జై సంవిధాన్ పాదయాత్రలో సుగుణక్క తో పాటు మాజీ ఎంపీ సోయాం బాపూరావు, బోథ్ నియోజకవర్గ ఇంచార్జ్ ఆడే గజేందర్ లు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా సుగుణక్క మాట్లాడుతూ..రాజ్యాంగ విలువలపై ప్రజల్లో అవగాహన పెంచడమే లక్ష్యంగా ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నామన్నారు.రాజ్యాంగం కేవలం ఒక పుస్తకం కాదని, అంబేడ్కర్, గాంధీ, పూలే లాంటి గొప్ప వాళ్ళ ఆలోచనలతో కూడిన ఒక పవిత్ర గ్రంథమన్నారు. పార్లమెంట్ సాక్షిగా రాజ్యాంగాన్ని బీజేపీ పార్టీ అనగదొక్కాలని చూస్తుందన్నారు. అమిత్ షా అంబెడ్కర్ ను పార్లమెంట్ సాక్షిగా అవమానించారన్నారు. గ్రామ, మండల స్థాయిలో ఈ కార్యక్రమాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్లాలని కోరారు.
Read More: Read Today’s E-paper News in Telugu
Comments are closed.